 |
Saranga Dariya Song Lyrics |
Saranga Dariya Song Lyrics In Telugu :
పాట : సారంగ దరియా
సినిమా : లవ్ స్టోరీ
సంగీతం : పవన్ సిహెచ్
గాయని : మంగ్లీ
గీత రచయిత : సుద్దాల అశోక్ తేజ
సారంగ దరియా పాట లిరిక్స్ :
[సంగీతం]
దాని కుడి భుజం మీద కడవా
దాని గుట్టెపు రైకలు మేరియా
అది రమ్మంటే రాదురా సెలియా
దాని పేరే సారంగ దరియా
[సంగీతం]
దాని ఎడం భుజం మీద కడవా
దాని ఏజెంటు రైకలు మేరియా
అది రమ్మంటే రాదురా సెలియా
దాని పేరే సారంగ దరియా
[సంగీతం]
కాళ్లకు వెండి గజ్జెల్
లేకున్నా నడిస్తే గల్ గల్
కొప్పుల మల్లే దండల్
లేకున్నా చెక్కిలి గిల్ గిల్
నవ్వుల లేవురా ముత్యాల్
అది నవ్వితే వస్తాయ్ మురిపాల్
నోట్లో సున్నం కాసుల్
లేకున్నా తమ్మలపాకుల్
మునిపంటితో మునిపంటితో
మునిపంటితో నొక్కితే పెదవుల్
ఎర్రగా అయితదిరా మనదిల్
చూరియా చూరియా చూరియా
అది సుర్మొ పెట్టిన చూరియా
అది రమ్మంటే రాదురా సెలియా
దాని పేరే సారంగ దరియా
దాని కుడి భుజం మీద కడవా
దాని గుట్టెపు రైకలు మేరియా
అది రమ్మంటే రాదురా సెలియా
దాని పేరే సారంగ దరియా
దాని ఎడం భుజం మీద కడవా
దాని ఏజెంటు రైకలు మేరియా
అది రమ్మంటే రాదురా సెలియా
దాని పేరే సారంగ దరియా
[సంగీతం]
రంగేలేని నా అంగీ
జడ తాకితే అయితది నల్లంగి
మాటల ఘాటూ లవంగి
మర్ల పడితే అది శివంగి
తీగలు లేని సారంగీ
వాయించబోతే అది ఫిరంగి
గుడియా గుడియాగుడియా
అది చిక్కి చిక్కని చిడియా
అది రమ్మంటే రాదురా సెలియా
దాని పేరే సారంగ దరియా
దాని సెంపాల్ ఎన్నెల కురియా
దాని సెవులకు దుద్దుల్ మెరియా
అది చిక్కి చిక్కని చిడియా
అది రమ్మంటే రాదురా సెలియా
[సంగీతం]
దాని నడుం ముడుతలే మేరియా
పడిపోతది మొగుళ్ళ దునియా
అది రమ్మంటే రాదురా సెలియా
దాని పేరే సారంగ దరియా
దాని కుడి భుజం మీద కడవా
దాని గుట్టెపు రైకలు మేరియా
అది రమ్మంటే రాదురా సెలియా
దాని పేరే సారంగ దరియా
దాని ఎడం భుజం మీద కడవా
దాని ఏజెంటు రైకలు మేరియా
అది రమ్మంటే రాదురా సెలియా
దాని పేరే సారంగ దరియా
[సంగీతం]
Comments
Post a Comment