Kolo Kolanna Kolo Song Lyrics In Telugu | Tuck Jagadish | Nani | Ritu Varma | Thaman S

Kolo Kolanna Kolo Song Lyrics In Telugu
Kolo Kolanna Kolo Song Lyrics

Kolo Kolanna Kolo Song Lyrics In Telugu :

పాట : కోలో కోలన్న కోలో 
సినిమా : టక్ జగదీష్ 
సంగీతం : థమన్ ఎస్ 
గాయకులు : అర్మాన్ మాలిక్, హరిణి ఇవ్వటూరి, శ్రీ కృష్ణ మరియు థమన్ ఎస్ 
గీత రచయిత : సిరివెన్నెల సీతారామశాస్త్రి
  

కోలో కోలన్న కోలో పాట లిరిక్స్ :

[సంగీతం]

కోలో కోలన్న కోలో 
కొమ్మలు కిల కిల నవ్వాలి 

[సంగీతం]

కోవెల్లో వెలిగే జ్యోతులు 
కళ్ళల్లో కొలువుండాలి 

[సంగీతం]

ఆరారు ఋతువుల్లోని 
అక్కర్లేనిది ఏవుంది 
చూడాలేగాని మన్నే 
రంగుల పూదోటవుతుంది 

తోడై నీవెంట 
కడదాకా నేనుంటా
రాల్లైనా ముల్లైనా
మన అడుగులు పడితే 
పూలై పొంగాలా... 

నువ్వు ధీనంగా ఏ మూలో కూర్చుంటే.. 

[సంగీతం]

నిను వెంటాడే దిగులే వెళిపోతుందా..

[సంగీతం]

యమ ధైర్యంగా ఎదురెళ్ళి నిల్చుంటే...
నిన్నెదిరించే బెదురింకా ఉంటుందా...
  

[సంగీతం]

కోలో కోలన్న కోలో 
కొమ్మలు కిల కిల నవ్వాలి
 

[సంగీతం]

కోవెల్లో వెలిగే జ్యోతులు 
కళ్ళల్లో కొలువుండాలి
 

[సంగీతం]

చిన చిన్న ఆనందాలు 
చినబోని అనుబంధాలు 
అపుడపుడు చక్కిలిగింతలు 
పెడుతుండగా

[సంగీతం]

కలతా కన్నీళ్లు లేని 
చిన నాటి కేరింతల్ని
చిటికేసి ఇటురమ్మంటూ
పిలిపించగా
 

[సంగీతం]

కదిలొస్తువుంది చూడు 
కన్నుల విందుగా 
ఊరందరిని కలిపే 
ఉమ్మడి పండుగా
 

ఆ నలుగురితో చెలిమి పంచుకో 
చిరునగవు సిరులు పెంచుకో
జడివానే పడుతున్నా జడిసేనా తడిసేనా 
నీ పెదవులపై చిరునవ్వులు ఎపుడైనా
 

 నువ్వు ధీనంగా ఏ మూలో కూర్చుంటే.. 

[సంగీతం]

నిను వెంటాడే దిగులే వెళిపోతుందా..

[సంగీతం]

యమ ధీమాగా ఎదురెళ్లి నిల్చుంటే... 
నిన్నెదిరించే బెదురింకా ఉంటుందా... 

[సంగీతం]

నీలోను నాలోనూ 
ఈ నేలేగా అమ్మై ఉంది 
అంతా అయినోళ్ళేగాని 
పరులెవ్వరూ
 

[సంగీతం]

మనలోని చుట్టరికాన్ని 
మరిపించే ఈ దూరాన్ని 
చెరిపే వీలుందంటే 
కాదనరెవ్వరూ
 

[సంగీతం]

ఒక పువ్వు విచ్చిన గంధం 
ఊరికే పోదుగా 
పది మందికి ఆనందం 
పంచకపోదుగా 
ఆ.. తగిన వరసైన తారకా 
తెరలు విడి దరికి చేరగా 
ప్రతి నిత్యం పున్నమిగా
 

అనుకోదా నెలవంకా 
కలలన్ని విరియగా 
విరిసిన వెన్నెలగా..

నువ్వు ధీనంగా ఏ మూలో కూర్చుంటే.. 

[సంగీతం]

ఓ నిను వెంటాడే దిగులే వెళిపోతుందా..

[సంగీతం]

యమ దర్జాగా ఎదురెళ్లి నిల్చుంటే... 
నిన్నెదిరించే బెదురింకా ఉంటుందా..
 

[సంగీతం] 

కోలో కోలన్న కోలో 
కొమ్మలు కిల కిల నవ్వాలి 

[సంగీతం]

కోవెల్లో వెలిగే జ్యోతులు 
కళ్ళల్లో కొలువుండాలి 

[సంగీతం]

Comments