ఆ.... అద్దాల మెడల్లో ఉండేటి దాననురా
అద్దాల మెడల్లో ఉండేటి దాననురా
అయితే ?
సింగపూర్ రంగబాబు ఫ్లైట్ ఎక్కమన్నాడు
ఉంగరాల గంగిరెడ్డి గోల్డ్ ఆఫర్ ఇచ్చాడు
తిక్కరేగి యమా బాబు ముహుర్తాలు పెట్టేసి
పెద్దూరి నాయుడితో పెళ్లి సేసినారురో
మందులోడా ఓరి మాయలోడా
మామ రారా మందుల సిన్నోడా
మందులోడా ఓరి మాయలోడా
మామ రారా మందుల సిన్నోడా
పెద్దూరి నాయుడికి నిన్నిచ్చి పెళ్లి చేస్తే
మద్దూరి పెద్దిరెడ్డి మద్దెల వాయించినాడే
సీన్నురి సిట్టిబాబు చిడతలు కొట్టాడే
మందులోడే ఆడు మాయలోడే
మళ్ళి రాడే మందుల సిన్నోడే
మందులోడే ఆడు మాయలోడే
మళ్ళి రాడే మందుల సిన్నోడే
[సంగీతం]
నా మొగుడు నాయిడు
ఏ పనిబాట సేయకుండా
మూలికలు, ఏర్లు తెత్తానని అడవులబట్టి పోయి
నన్ను మరిసే పోనాడు
అవునా ?
ఏ ఊర్లెళ్ళాడు? ఏ ఏర్లు తెచ్చాడు?
తూరుపు ఎల్లాడు తుమ్మేరు తెచ్చాడు
పడమర ఎల్లాడు పల్లేరు తెచ్చాడు
దచ్చినమెల్లాడు దబ్బెరు తెచ్చాడు
ఉత్తరమెళ్ళాడు ఉల్లేరు తెచ్చాడు
మందులు మందులని మాయమైపోయినాడు
మందులోడా ఓరి మాయలోడా
మామ రారా మందుల సిన్నోడా
మందులోడా ఓరి మాయలోడా
మామ రారా మందుల సిన్నోడా
మందులోడే ఆడు మాయలోడే
మళ్ళి రాడే మందుల సిన్నోడే
మందులోడే ఆడు మాయలోడే
మళ్ళి రాడే మందుల సిన్నోడే
[సంగీతం]
పైటే పట్టమంటే పల్లేరు తెచ్చాడా
నడుమే గిల్లమంటే నల్లేరు అల్లాడా...
ముద్దులు పెట్టమంటే మూలికలే ఇచ్చాడా
ముచ్చట తీర్చమంటే ముడూర్లు తిరిగాడా
మేమున్నామే పిల్ల
వద్దు నీకు మందు మాకు
మందులోడా ఓరి మాయలోడా
మామ రాకు మందుల సిన్నోడా
మందులోడా ఓరి మాయలోడా
మళ్ళి రాకు మందుల సిన్నోడా
మందులోడా ఓరి మాయలోడా
మామ రారా మందుల సిన్నోడా
మందులోడా ఓరి మాయలోడా
మామ రారా మందుల సిన్నోడా...
Comments
Post a Comment