ఏయ్ రారో ఏయ్ రారో
ఏయ్ రారో ఏయ్ రో
ఏయ్ రారో ఏయ్ రారో
ఏయ్ రారో ఏయ్ రో
నా ప్రాణంలోని ప్రాణం
నా దేహంలోని దాహం
నా మౌనం పాడే గానం
నా ప్రశ్న సమాధానం...
అది అందమైన అందరాని కన్నె రా
లక్ష అక్షరాలు రాయలేని కవిత రా
ఈ ప్రపంచమే కోరుకునే అతివరా
పెను విప్లవాల విశ్వకన్య స్వేచ్ఛ రా
నా కళ్ళలోన రంగుల కలరా...
నా కళ్ళలోన రంగుల కలరా
నా ఊహలకే ఉనికే తనురా
నా బతుకులోన భాగం కదరా
నా ఊపిరికే అర్థం తనురా
ఏయ్ రారో ఏయ్ రారో
ఏయ్ రారో ఏయ్ రో
ఏయ్ రారో ఏయ్ రారో
ఏయ్ రారో ఏయ్ రో
ఏయ్ రారో ఏయ్ రారో
ఏయ్ రారో ఏయ్ రో
ఏయ్ రారో ఏయ్ రారో
ఏయ్ రారో ఏయ్ రో
[సంగీతం]
తెల్లవాడినెదిరించి నల్లని చీకట్ల నుంచి
పిల్లను విడిపించి తెచ్చి సంబరాలు చేసుకుంటే....
అంతలోనే తెలిసిందది మాయమైదని
ముందుకన్న ముప్పువున్న పంజరానా ఉన్నదని
అసలెక్కడుందో తెలియకుంది చూడరా
అది లేక మనిషికింకా విలువేదిరా
ఏ పోరాటంలో దానిని చేరాలి రా....
ఏ ఆయుధంతో దానిని గెలవాలి రా
ఏయ్ రారో ఏయ్ రారో
ఏయ్ రారో ఏయ్ రో
ఏయ్ రారో ఏయ్ రారో
ఏయ్ రారో ఏయ్ రో
[సంగీతం]
అనాధిగా ఎవడో ఒకడు అది నాకే సొంతమంటూ
నియంతలై నిరంతరం చెరలో బంధించినారు...
రెక్కలనే విరిచేసి హక్కులనే చెరిపేసి
అడిగే ప్రతి ఒక్కడిని అణిచి అణిచి వేసినారు...
నల్లజాతి చరిత్రలో నలిగి పోయెరా
చల్లారని స్వాతంత్ర కాంక్ష స్వేచ్ఛ రా
నరనరాల్లోన ప్రవహించే ఆర్తి రా...
కనిపించకనే నడిపించే కాంతి రా
ఏయ్ రారో ఏయ్ రారో
ఏయ్ రారో ఏయ్ రో
ఏయ్ రారో ఏయ్ రారో
ఏయ్ రారో ఏయ్ రో
ఏయ్ రారో ఏయ్ రారో
ఏయ్ రారో ఏయ్ రో
ఏయ్ రారో ఏయ్ రారో
ఏయ్ రారో ఏయ్ రో.....
Comments
Post a Comment