చీకటి చిరుజ్వాలై
నిప్పులు కురిసిందే
కత్తులు దూసిందే
గుండెను కోసిందే
గాయం సేసిందే
సాయం లేకుందే
సాయం లేకుందే
[సంగీతం]
రగులుతుంది రక్త కణం
గుండెలోన నిప్పు కణం
రేయి పగలు లేని రణం
మాటల్లో చెప్పలేని
మౌనంతో ఆపలేని
అర్ధమవని యుద్ధమేదో
నా లోపల జరుగుతుంది
కాలం నను కాల్చుతోంది
విషమై ఎగబాకుతోంది
నా ప్రేమకు మలినమంటి
నా హృదయం భగ్గు మంది
కాల్చేసినా.... ఏంచేసినా..
నాలోని నరకాన్ని
మరిచేదెలా ఓ ఈ యాచన
కాల్చేసినా.... ఏంచేసినా..
నాలోని నరకాన్ని
మరిచేదెలా ఓ ఈ యాచన
[సంగీతం]
Comments
Post a Comment