అలా ఇలా అనాలని
ఇలా ఎలా ఉందే
అవి ఇవి వినాలని
ఇవాళ తోచిందే
పెదవులపైనా మెరిసే
ఈ నవ్వులే
ఇదివరకైతే ఎపుడు కనిపించలే
ఇన్నాళ్ళీ వెన్నెలన్ని లోలోపలే
ఎంతో ఎంతో సంతోషంతో
ఉన్నా... నేనీ క్షణం
అంతో ఇంతో వింతే నీతో
సాగే సహజీవనం
అలా ఇలా అనాలని
ఇలా ఎలా ఉందే
అవి ఇవి వినాలని
ఇవాళ తోచిందే
[సంగీతం]
పని తెలియని పసితనమట నాది
అది తెలిసిన పేద మనసట నీది
అనువుగా మరి జరగదు కదా ఏది
అనుకువగల మగువకు తిరుగేది
నీ వలనే అవుతోందేమో
నే నెపుడు కోరే పని
నీ జతగా ఉండే గుండే
అంటుందే ఇంతే చాలని...
వందేళ్ళి వర్ణాలన్నీ తోడుండని
ఎంతో ఎంతో సంతోషంతో
ఉన్నా... నేనీ క్షణం
అంతో ఇంతో వింతే నీతో
సాగే సహజీవనం
అలా ఇలా అనాలని
ఇలా ఎలా ఉందే
అవి ఇవి వినాలని
ఇవాళ తోచిందే
Comments
Post a Comment