ఏమైందో ఈ వేళా ఈ గాలి
రంగులేవో తెలిసిందా ఓహో...
అందమైన ఊహేదో మదిలో వాలి
అల్లరేదో చేసిందా ఓహో...
మెత్తనైన నీ పెదవులపై
నా పేరే రాశావా
నే పలికే భాషే
నువ్వయ్యావే వన్నెలా హో
రెండు కన్నులెత్తి గుండెలపై
నీ చూపే గీశావా
ఆ గీతే దాటి
అడుగునైనా విడువలెనే నేనిలా
ఆనందమా ఆనందం మదికే
ఏమందమే ఏమందంఒలికే
నీ నవ్వు నా గుండె గదికే
వెలుగే వెన్నెలా
ఆనందమా ఆనందం మదికే
ఏమందమే ఏమందంఒలికే
నీ పిలుపు నా అడుగు నదికే
పొంగే వరదలా
[సంగీతం]
మిల మిల మెరిసే
కను చివరలే మినుకుల్లా
విసరకు నువ్వే
నీ చూపులే మెరుపుల్లా
మెరిసేనా మెల్లగా
దారిలోన మల్లెలవాన
కురిసేనా ధారగా
రంగు రంగు తారలతోనా
వెన్నెలై క్షణాళిల
స్వరాలు పూసేనా ఓ....
ప్రేమలో ఓ నిమిషమే
యుగాలు సాగేనా
ఆనందమా ఆనందం మదికే
ఏమందమే ఏమందంఒలికే
నీ నవ్వు నా గుండె గదికే
వెలుగే వెన్నెలా
ఆనందమా ఆనందం మదికే
ఏమందమే ఏమందంఒలికే
నీ పిలుపు నా అడుగు నదికే
పొంగే వరదలా
Comments
Post a Comment